మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

| Edited By:

Jul 31, 2020 | 3:12 PM

ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. సైబర్ దాడులు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్‌ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్‌’ పేరుతో ఓ మాల్‌వేర్‌ చలామణిలో ఉందని

మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
Follow us on

ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో.. సైబర్ దాడులు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్‌ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్‌’ పేరుతో ఓ మాల్‌వేర్‌ చలామణిలో ఉందని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్‌వేర్‌ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్‌ ఆప్స్‌ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌.ఇన్)‌ హెచ్చరించింది. ఈ ట్రోజన్‌ వైరస్‌ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ మాల్‌వేర్ ఎక్కువగా బ్యాంకింగ్, సామాజిక, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్, డేటింగ్ యాప్ లపై దాడిచేస్తుంది.  స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్‌ డ్రాయర్‌ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్‌ అప్‌డేట్‌ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని సెర్ట్ వివరించింది. ఒక్కసారి అనుమతులిస్తే.. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్‌ తెలిపింది. అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్‌వేర్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!