ఏపీలో నిలకడగా కరోనా, గడిచిన 24 గంటల్లో 349 మందికి పాజిటివ్, ఉద్ధృతి తగ్గినప్పటికీ నేనున్నానంటోన్న మహమ్మారి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూం తాజాగా కరోనా కేసుల వివరాలు వెల్లడించింది. గత 24 గంటల్లో 55,740 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 349..

ఏపీలో నిలకడగా కరోనా, గడిచిన 24 గంటల్లో 349 మందికి పాజిటివ్, ఉద్ధృతి తగ్గినప్పటికీ నేనున్నానంటోన్న మహమ్మారి

Edited By:

Updated on: Dec 30, 2020 | 7:36 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూం తాజాగా కరోనా కేసుల వివరాలు వెల్లడించింది. గత 24 గంటల్లో 55,740 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు పేర్కొంది. చిత్తూరు, కడప, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 472 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు కేసుల సంఖ్య 8,81,948 కి పెరిగింది. మొత్తం 7,104 మంది మృతి చెందారు. 8,71,588 మంది కరోనా నుంచి రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,256 యాక్టివ్ కేసులు ఉన్నాయని తాజా బులిటెన్ లో పేర్కొన్నారు.

file:///C:/Users/website.TV9ABCPL/Desktop/C_Media%20Bulletin%20No%20384_COVID_T_30%20DEC%2010%20AM.pdf

Loading...
Unable to load recommendations.
Follow Us