
Anchor Pradeep About His First Movie As Hero: యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఎన్నో ప్రముఖ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోన్న ప్రదీప్. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సైడ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ తొలిసారి హీరోగా మారి ‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో నటిస్తోన్న విషయంలో తెలిసిందే.
మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈనెల 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ముహుర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి యాంకర్ కమ్ హీరో.. ప్రదీప్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. హీరోగా సినిమా తెరకెక్కిస్తోన్న సమయంలో.. అసలు నేను హీరోగా మెప్పించగలనా..? వారిని నవ్విస్తానా..? లేదా.? అనే భయాలతోనే ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లే వాడినని చెప్పుకొచ్చాడు. దర్శకనిర్మాతలు తనపై పెట్టుకున్న నమ్మకం వల్లే ఈ సినిమా చేయగలిగా అని ప్రదీప్ అన్నారు. ఇక తాను హీరోగా మారడంపై ప్రదీప్ స్పందిస్తూ.. తాను హీరోగా మారడానికి పదేళ్లు పట్టిందని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చా అని చెప్పుకొచ్చారు. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ వెండి తెరపై ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలి.