కాబూల్‌లో భూ ప్రకంపనలు.. భయం గుప్పట్లో ప్రజలు..

యావత్ ప్రపంచం ఓ వైపు కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రకృతి తనదైన రీతిలో ప్రజల్ని వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే..

కాబూల్‌లో భూ ప్రకంపనలు.. భయం గుప్పట్లో ప్రజలు..
Earthquake

Updated on: Jul 06, 2020 | 11:08 PM

యావత్ ప్రపంచం ఓ వైపు కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. నిత్యం ఎక్కడో ఓ చోట ప్రకృతి తనదైన రీతిలో ప్రజల్ని వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే.. మరికొన్ని చోట్ల భూ ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో భూమి కంపించింది. సౌత్‌వెస్ట్‌ కాబూల్‌కి 30 కిలో మీటర్ల దూరంలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్‌ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భారత కాలమాన ప్రకారం.. సోమవారం రాత్రి 9.36 నిమిషాలకు ఈ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us