ఈశాన్య భారత్‌తో పాటు నేపాల్‌లో భూ ప్రకంపనలు

| Edited By:

Apr 24, 2019 | 7:55 AM

న్యూ ఢిల్లీ ‌: ఈశాన్య భారత్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో పరుగులు తీశారు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. […]

ఈశాన్య భారత్‌తో పాటు నేపాల్‌లో భూ ప్రకంపనలు
Follow us on

న్యూ ఢిల్లీ ‌: ఈశాన్య భారత్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో పరుగులు తీశారు. అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతే కాక అరుణాచల్‌ ప్రదేశ్‌కు సరిహద్దులో ఉన్న మయన్మార్‌, భూటాన్‌లో కూడా భూమి కంపించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ ప్రకటించింది.

మరోవైపు నేపాల్ లో కూడా బుధవారం భూకంపం సంభవించింది. ఖాట్మండు కేంద్రంగా బుధవారం ఉదయం 6.14 గంటలకు భూమి కంపించింది. నేపాల్‌లోని ధడేంగ్ జిల్లా నౌబైస్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది.