ఆర్టీసీ బస్సులో దారుణం.. సీట్లోంచి లేవమన్నందుకే.. కత్తితో దాడి

ఆర్టీసీ బస్సులో దారుణం చోటుచేసుకుంది. లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకు కత్తితో దాడి చేశాడు గుర్తుతెలియని దుండగుడు. హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో ప్రయాణిస్తోన్న..

ఆర్టీసీ బస్సులో దారుణం.. సీట్లోంచి లేవమన్నందుకే.. కత్తితో దాడి

Updated on: Feb 19, 2020 | 5:57 PM

Crime News: ఆర్టీసీ బస్సులో దారుణం చోటుచేసుకుంది. లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకు కత్తితో దాడి చేశాడు గుర్తుతెలియని దుండగుడు. హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో ప్రయాణిస్తోన్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. బస్సులో మహిళపై కత్తితో దాడి చేశాడు నిందితుడు. లేడీస్ సీట్లో కూర్చున్న వ్యక్తిని లేవమన్నందుకు.. అనురాధ అనే మహిళపై దాడి చేశాడు. అనంతరం రన్నింగ్ బస్సులో నుంచి దూకి పారిపోయాడు దుండగుడు. కాగా ఈ దాడిలో మహిళ స్వల్పంగా గాయపడింది. దీంతో.. బాధితురాలితో పాటు బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us