బిగ్ బి ఫ్యామిలీ నుంచి మరో హీరో…!

తాజాగా ఆయన కూతురు శ్వేతా బచ్చన్‌ నందా కుమారుడు అగస్త్య నందా ఓ సినిమాలో హీరోగా మెప్పించబోతున్నాడట. అగస్త్యకు బాల్యం నుంచే సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉందట...

బిగ్ బి ఫ్యామిలీ నుంచి మరో హీరో...!

Updated on: Jul 11, 2020 | 3:57 PM

Amitabh Grandson Agastya Nanda to Enter Bollywood..! :  బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో నుంచి మరో స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. బిగ్ బి ఇంట్లో అందరూ నటులే.. ఆయన సతీమణి జయ బచ్చన్ అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్.. కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ .. ఇలా అంతా సినిమా ప్రపంచంలోనివారే… తాజాగా ఆయన కూతురు శ్వేతా బచ్చన్‌ నందా కుమారుడు అగస్త్య నందా ఓ సినిమాలో హీరోగా మెప్పించబోతున్నాడట. అగస్త్యకు బాల్యం నుంచే సినిమాల్లోకి రావాలన్న కోరిక ఉందట. చూడటానికి కూడా మంచి ఫిజిక్ ఉండటంతో బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు వెంటడపడుతున్నారని సమాచారం.

అయితే అమితాబ్‌ బచ్చన్‌ వంటి పెద్ద కుటుంబం కావడంతో..  సోషల్ మీడియాలో అగస్త్యకు మంచి ఫాలోవర్లు ఉన్నారు.  అగస్త్య ప్రస్తుతం సినిమా కథలు వింటున్నాడని తెలుస్తోంది. నచ్చిన కథతో హీరోగా బాలీవుడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మరోవైపు, అగస్త్య సోదరి నవ్య నవేలీ నందా మోడల్‌గా రాణించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఓ ఎన్జీవోను స్థాపించి.. సేవా కార్యక్రమాలు చేస్తోంది.