పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాన్యుడిలా మారిపోయారు. ఒక రైతు ఇంట్లో నేలపై కూర్చోని భోజనం చేశారు. పశ్చిమ మెడినిపూర్ జిల్లాలోని బెలిజూరి గ్రామానికి చెందిన అన్నదాత ఇంట్లో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఆతిథ్యాన్ని స్వీకరించారు అమిత్ షా. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌తో కలిసి అమిత్ షా భోజనం చేశారు. ఓ వైపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా అన్నదాతల మద్దతు పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నిన్న మధ్యప్రదేశ్ రైతులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఇవాళ అమిత్ షా ఏకంగా రైతు ఇంట్లో విందులో పాల్గొన్నారు.
కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా పశ్చిమ బెంగాల్ పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా బెంగాల్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ సందర్బంగా రైతు ఇంట్లో భోజనం చేస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ ఆయనే ట్వీట్ చేశారు. ‘కోల్‌కతాకు చేరుకున్నాను. గురుదేవ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి గొప్ప నాయకుల గడ్డ మీద అడుగుపెట్టిన సందర్భంగా ఈ భూమికి నమస్కరిస్తున్నా’ అని పేర్కొన్నారు.
West Bengal: Union Home Minister Amit Shah, BJP General Secretary Kailash Vijayvargiya and state BJP chief Dilip Ghosh having lunch at a farmer’s house in Belijuri village in Paschim Medinipur district. pic.twitter.com/yMSmIsan6P
— ANI (@ANI) December 19, 2020