‘ఇది వసుధైక కుటుంబం’..ప్రపంచాన్ని కలిపిన అమెరికన్ ఐడల్ సింగర్

‘వుయ్ ఆర్ ది వరల్డ్’ (ఇది వసుధైక కుటుంబం) అంటూ అమెరికన్ ఐడల్ ఫినాలేలో తన గళమెత్తి పాడాడు సింగర్ లయొనిల్ రిచీ !సీజన్ 18 కంటెస్టెంట్లతో బాటు ఐడల్ జడ్జీలు కేటీ పెర్రీ, ల్యూక్ బ్రియాన్ తదితరులు కూడా ఈ అద్భుత  గాత్ర కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. ‘ఈ ప్రపంచమంతా ఒక్కటై మానవాళి ప్రయోజనాలకు పాటు పడాలి’ అని  రిచీ గళమెత్తగా… ఇదివరకు సీజన్లలో పార్టిసిపేట్ చేసిన సింగర్స్ కూడా అతనికి ‘సహకరించారు’. ఈ సాంగ్ […]

  • Umakanth Rao
  • Publish Date - 5:33 pm, Mon, 18 May 20
'ఇది వసుధైక కుటుంబం'..ప్రపంచాన్ని కలిపిన అమెరికన్ ఐడల్ సింగర్

‘వుయ్ ఆర్ ది వరల్డ్’ (ఇది వసుధైక కుటుంబం) అంటూ అమెరికన్ ఐడల్ ఫినాలేలో తన గళమెత్తి పాడాడు సింగర్ లయొనిల్ రిచీ !సీజన్ 18 కంటెస్టెంట్లతో బాటు ఐడల్ జడ్జీలు కేటీ పెర్రీ, ల్యూక్ బ్రియాన్ తదితరులు కూడా ఈ అద్భుత  గాత్ర కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. ‘ఈ ప్రపంచమంతా ఒక్కటై మానవాళి ప్రయోజనాలకు పాటు పడాలి’ అని  రిచీ గళమెత్తగా… ఇదివరకు సీజన్లలో పార్టిసిపేట్ చేసిన సింగర్స్ కూడా అతనికి ‘సహకరించారు’. ఈ సాంగ్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గల ప్రముఖ కట్టడాలు, నగరాలు, పర్వత ప్రాంతాల దృశ్యాలను వీరి ముఖాలపై సూపర్ ఇంపోజ్ చేయడం అద్భుతం. కోరస్ లా సాగిన ఈ సంగీత కార్యక్రమంలో న్యూయార్క్ సిటీలోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, సబ్ వే, ఫ్లోరిడా, కాలిఫోర్నియాల లోని బీచ్ లు, అతి పెద్ద స్టేడియాలు, ఆఫ్రికా లోని పర్వతాలు, హైతీలోని అతి పురాతన  చారిత్రక ప్రాధాన్య కట్టడాన్ని, తదితరాలను చూపుతున్న  ఈ వీడియో వాహ్ అనేలా ఉంది.

Video Courtesy By: abc