11 ఏళ్ల తర్వాత తండ్రైన అంబటి రాయుడు

పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత తండ్రి అయ్యాడు అంబటి. ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించే అంబటి తన గారాల పట్టిని చిరునవ్వుతో ఈ ప్రపంచంలోకి స్వాగతం చెప్పాడు....

11 ఏళ్ల తర్వాత తండ్రైన అంబటి రాయుడు

Updated on: Jul 13, 2020 | 3:09 PM

Ambati Rayudu blessed with baby girl : టీమిండియా, హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు తండ్రయ్యాడు. ఆయన సతీమణి చెన్నుపల్లి విద్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2009 లో చెన్నుపల్లి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంబటి రాయుడు. పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత తండ్రి అయ్యాడు అంబటి. ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించే అంబటి తన గారాల పట్టిని చిరునవ్వుతో ఈ ప్రపంచంలోకి స్వాగతం చెప్పాడు.

ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇక రాయుడు 2018 నుండి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ కోసం తనను ఎంపిక చేయకపోవడంతో నిరాశకు గురైన రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ తర్వాత దానిని వెనక్కి తీసుకున్నాడు.