ఈవీఎం లు సేఫ్.. నో డౌట్ !

యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఈవీఎం లను తరలించారంటూ వచ్చిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ఈ నెల 23  న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందు వీటి భద్రతకు సంబంధించి అన్ని నిబంధనలను పాటించినట్టు పేర్కొంది. అన్ని పార్టీల అభ్యర్థుల ఎదుట ఈవీఎం లను, వీవీ ప్యాట్లను ఎన్నికల అధికారులు సీల్ చేసినట్టు ఈసీ తెలిపింది. యూపీ, బీహార్ రాష్ట్రాల్లోబీజేపీ నేతల ఆదేశాలతో ఈవీఎం లను స్ట్రాంగ్ రూముల నుంచి తరలించారని […]

ఈవీఎం లు సేఫ్.. నో డౌట్ !

Updated on: May 21, 2019 | 2:38 PM

యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఈవీఎం లను తరలించారంటూ వచ్చిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ఈ నెల 23  న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందు వీటి భద్రతకు సంబంధించి అన్ని నిబంధనలను పాటించినట్టు పేర్కొంది. అన్ని పార్టీల అభ్యర్థుల ఎదుట ఈవీఎం లను, వీవీ ప్యాట్లను ఎన్నికల అధికారులు సీల్ చేసినట్టు ఈసీ తెలిపింది. యూపీ, బీహార్ రాష్ట్రాల్లోబీజేపీ నేతల ఆదేశాలతో ఈవీఎం లను స్ట్రాంగ్ రూముల నుంచి తరలించారని కొన్ని పార్టీలు ఆరోపించాయి. అయితే వీటిని ఎన్నికల సంఘం కొట్టివేసింది. భారత దేశంలోని ఈవీఎం ల పనితీరుపట్ల ఆస్ట్రేలియా ప్రశంసలు కురిపించిన్ సంగతి తెలిసిందే.
Loading...
Unable to load recommendations.
Follow Us