ప్రదాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ.. అనంతరం ప్రధాని కీలక ప్రకటన

ప్రదాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. దేశంలో నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తిపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో వర్చువల్ విధానంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.

ప్రదాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ.. అనంతరం ప్రధాని కీలక ప్రకటన

Updated on: Dec 09, 2020 | 6:12 AM

ప్రదాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. దేశంలో నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తిపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో వర్చువల్ విధానంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న పలు వ్యాక్సిన్ల గురించి చర్చించే అవకాశం ఉంది. సమావేశం చివరలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. సమావేశం అనంతరం వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన వెలువడే ఛాన్స్‌ ఉంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్, పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న కోవీషీల్డ్, అహ్మబాద్‌లోని జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న జైకోవ్‌-డి టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే యూకె, రష్యా వంటి దేశాలు ఎమర్జెన్సీ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఎమర్జెన్సీ వ్యాక్సిన్‌పై అనుమతులేమైనా ఇచ్చే అవకాశం ఉందనేది సమావేశం అనంతరం తేలనుంది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీపై ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us