ఉద్యోగుల తొలగింపు.. దుకాణం ఎత్తేసిన యూసీ వెబ్

చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌.. అనుబంధ సంస్థ యూసీ వెబ్‌ (UC Web)భారత్‌లో కార్యకలాపాలను క్లోజ్ చేసింది. దేశవ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న 350 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే..

ఉద్యోగుల తొలగింపు.. దుకాణం ఎత్తేసిన యూసీ వెబ్

Updated on: Jul 17, 2020 | 4:42 PM

Alibaba Owned UC Web Suspends India : చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌.. అనుబంధ సంస్థ యూసీ వెబ్‌ (UC Web)భారత్‌లో కార్యకలాపాలను క్లోజ్ చేసింది. దేశవ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న 350 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 90శాతం మందిని తొలగించింది. అసోసియేట్‌, మేనేజ్‌మెంట్‌, ఎంట్రీ లెవల్‌ స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తొలగింపు సమాచారాన్ని అందించింది. ఉద్యోగులందరికీ 30 రోజుల నోటీసు సమయాన్ని ఇచ్చినట్లుగా సమాచారం.

చైనా గిచ్చికయ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో 2009లో యూసీవెబ్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. మొబైల్‌ బ్రౌజర్‌ యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, వీ చాట్‌ సేవలను భారత్‌లో విస్తరించింది. క్లబ్‌ ఫ్యాక్టరీ యాప్‌ను బ్యాన్‌ చేయడంతో ఆ సంస్థ చెల్లింపులను నిలిపివేసింది.