మరోసారి ముంబై పోలీసులకు అండగా నిలిచిన అక్షయ్

|

Aug 03, 2020 | 4:38 AM

కరోనా సంక్షోభంలో సినీ ప్రముఖులు ఎందరో తమవంతు సాయం అందిస్తున్నారు. ప్రధాని ప్రారంభించిన పీఎం కేర్‌ ఫండ్‌కు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చాడు. ఆ తర్వాత ముంబై కార్పొరేషన్‌కు రూ. 3 కోట్లు ప్రకటించాడు. అంతేకాదు కరోనా కట్టడి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముంబై పోలీసులకు రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు. తాజాగా అదే ముంబై పోలీసులకు అక్షయ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లు అందజేశాడు.

మరోసారి ముంబై పోలీసులకు అండగా నిలిచిన అక్షయ్
Follow us on

కరోనా సంక్షోభంలో సినీ ప్రముఖులు ఎందరో తమవంతు సాయం అందిస్తున్నారు. ప్రధాని ప్రారంభించిన పీఎం కేర్‌ ఫండ్‌కు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చాడు. ఆ తర్వాత ముంబై కార్పొరేషన్‌కు రూ. 3 కోట్లు ప్రకటించాడు. అంతేకాదు కరోనా కట్టడి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ముంబై పోలీసులకు రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు. తాజాగా అదే ముంబై పోలీసులకు అక్షయ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లు అందజేశాడు. ఈ డివైజ్‌ ధరిస్తే ఆక్సిజన్‌, శరీర ఉష్ణోగ్రత, హర్ట్‌ రేట్‌ తెలిసిపోతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో పోలీసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అక్షయ్‌ ఈ డివైజ్‌లను విరాళంగా ఇచ్చాడు.

అక్షయ్‌ చేసిన సాయాన్ని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్‌ ద్వారా అభినందించారు. ముంబై పోలీసులతో పాటు నాసిక్‌ పోలీసులకు సైతం అక్షయ్‌ ఈ హెల్త్‌ ట్రాకింగ్‌ డివైజ్‌లను అందజేశారని వెల్లడించారు.‘‘అక్షయ్‌ గారు ఎల్లప్పుడు సైన్యానికి, వివిధ రాష్ట్రాల్లోని పోలీసులకు ఎంతో మద్దతుగా ఉంటారు. కొవిడ్‌ వారియర్స్‌పై ఆయన చూపించిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ డివైజ్‌లను బీఎంసీ ఉద్యోగులకు ఇచ్చే విషయంపై కూడా చర్చించాం’’అని ఆదిత్య ఠాక్రే ట్వీట్‌లో పేర్కొన్నారు. గత నెలలో నటుడు సోనూ సూద్‌ కూడా ముంబై పోలీసులకు 25వేల ఫేస్‌ షీల్డ్స్‌ విరాళంగా ఇచ్చాడు. మరో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, సోనూసూద్ కరోనా కారణంగా కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.