Flash : అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్

|

Nov 07, 2020 | 3:37 PM

బాలీవుడ్‌లో సంచలన కాంబినేషన్ సెట్టయ్యింది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ బిగ్ బి అమితాబ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు.

Flash : అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్
Follow us on

బాలీవుడ్‌లో సంచలన కాంబినేషన్ సెట్టయ్యింది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ బిగ్ బి అమితాబ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు.  ఇప్పటి వరకు హీరోగా, నిర్మాతగా సత్తా చాటిన అజయ్ దేవగణ్ ఇప్పుడు మెగాఫోన్ పట్టి ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దమయ్యారు.  ‘మేడే’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకకెక్కనుంది. థ్రిల్లర్ మూవీగా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. .బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. డిసెంబర్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాలో అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.  మన హైదరాబాద్‌లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనుంది. కాగా ఈ కాంబినేషన్ బాలీవుడ్ మూవీ లవర్స్‌ను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ప్రస్తుతం అజయ్ దేవగణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.


Also Read : వరుడికి ఇచ్చిన పెళ్లికానుకలను చూస్తే షాకవుతారు…!