కేరళలోని కోజికోడ్‌లోని కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రన్ వేపై ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో విమానం రెండు ముక్కలైంది. వందే భారత్ మిషన్‌లో భాగంగా విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు చేరుకుంది. ఈ ఘటనలో పైలెట్ అక్కడిక్కడే మృతి చెందాడు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 190 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
#WATCH Kerala: Dubai-Kozhikode Air India flight (IX-1344) with 190 people onboard skidded during landing at Karipur Airport today. (Video source: Karipur Airport official) pic.twitter.com/aX90CYve90
— ANI (@ANI) August 7, 2020