గ్లాసు గేదె పాల కోసం బీహార్ వస్తానంటూ సోనూసూద్ ట్వీట్

|

Aug 21, 2020 | 12:28 PM

ఓ కుటుంబ ఆదాయ వ‌నరైన గేదె చ‌నిపోవ‌డంతో వారికి మ‌రో గేదెని కొనిచ్చి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు యాక్టర్ సోనూసూద్.

గ్లాసు గేదె పాల కోసం బీహార్ వస్తానంటూ సోనూసూద్ ట్వీట్
Follow us on

ఆపదలో ఉన్నవారికి నేనున్నంటూ వెంటనే స్పందిస్తూ జన హృదయాలను కొల్లగొట్టిన యాక్టర్ సోనూసూద్ మరోసారి మనసు దోచేసుకున్నాడు. తాజాగా ఓ కుటుంబ ఆదాయ వ‌నరైన గేదె చ‌నిపోవ‌డంతో వారికి మ‌రో గేదెని కొనిచ్చి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. అయితే ,వారి కోసం కొత్త గేదెను కొన్న‌ప్పుడు క‌లిగిన ఆనందం, నా తొలి కారు కొన్న‌ప్పుడు క‌ల‌గ‌లేదంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకు బీహార్ వ‌చ్చిన‌ప్పుడు ఆ గెదె పాలు గ్లాస్ తాగుతానంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

బిహార్ చంపారన్ లోని భోలా గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి పాల వ్యాపారమే జీవనాధారం. ఇటీవల కన్న కొడుకుని, కుటుంబానికి ఏకైన ఆదాయ వనరు అయిన గేదెను కోల్పోయింది. ఈ విష‌యాన్ని కొందరు స్థానికులు ట్వీట్టర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంట‌నే స్పందించిన అపర కర్ణుడు సోనూసూద్ కొత్త గెదెని వారికి అందేలా త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాడు. దీంతో ఆ కుటుంబం ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అనుకోకుండా అందిన సాయంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ కుటుంబం సోనూసూద్ కి కృతజ్ఞత చెప్పుకున్నారు.