చాంద్రాయణగుట్ట హంతకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో మొన్న తన అక్క, చెల్లిపై దాడి చేసి హత్య చేసిన నిందితుడు అహ్మద్‌ బా ఇస్మాయిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని...

చాంద్రాయణగుట్ట హంతకుడి ఆత్మహత్య

Updated on: Jul 02, 2020 | 1:45 PM

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో మొన్న తన అక్క, చెల్లిపై దాడి చేసి హత్య చేసిన నిందితుడు అహ్మద్‌ బా ఇస్మాయిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి గొడవలతో తన అక్క, చెల్లితో పాటు బావపై కూడా కత్తితో దాడి చేశాడు ఇస్మాయిల్‌. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకుముందు రెండేళ్ల క్రితమే తన భార్యను కూడా హత్య చేశాడు ఇస్మాయిల్‌. పరారీలో ఉన్న అహ్మద్‌ బా ఇస్మాయిల్‌ అదే ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గత సోమవారం సాయంత్రం సొంత అక్కచెల్లెళ్లనే దారుణంగా నరికి చంపాడు. అహ్మద్‌ బా ఇస్మాయిల్‌ ‌ గత ఏడాది భార్యను హత్య చేసిన కేసులో అరెస్టు‌ కాగా, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్కచెల్లెళ్లను హత్య చేసిన తర్వాత ఇస్మాయిల్ పారిపోయాడు. దీంతో పరారీలో ఉన్న ఇస్మాయిల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నడనే సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు, సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us