AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీ ప్రాణాలకే రిస్క్.. ఇప్పటికే 9మంది మృతి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఢిల్లీలో 9 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం వేసవి కాలంలో ఏసీల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేవలం షార్ట్ సర్క్యూట్లే కాదు, కంప్రెసర్ అధిక వేడి, రిఫ్రిజెరెంట్ లీకేజీలు మీ ఇంట్లో బాంబుల్లా మారవచ్చు. అసలు ఏసీలు ఎందుకు పేలుతున్నాయి? మనం చేసే ఏ చిన్న తప్పు ప్రాణాంతకంగా మారుతోందా? అనేది తెలుసుకుందాం..

ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీ ప్రాణాలకే రిస్క్.. ఇప్పటికే 9మంది మృతి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Ac Blast Prevention Tips
Krishna S
|

Updated on: May 05, 2026 | 12:37 PM

Share

ఎండాకాలం వచ్చిందంటే ఏసీలకు గిరాకీ పెరిగిపోతుంది. ఏసీ లేనిదే ఉండలేని స్థితి.. అయితే ఏసీలు పేలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధానిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఒక నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఏసీ యూనిట్‌లో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. సాధారణంగా ఏసీ ప్రమాదాలు ఆకస్మికంగా జరగవని, సరైన నిర్వహణ లేకపోవడం, యంత్రాలపై దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన కారణాలు

కంప్రెసర్ ఓవర్‌హీటింగ్: ఏసీ నిరంతరాయంగా పనిచేయడం వల్ల కంప్రెసర్ అధిక వేడికి గురవుతుంది. దుమ్ము పేరుకుపోయిన కాయిల్స్ వల్ల ఈ భారం మరింత పెరుగుతుంది. విద్యుత్ షార్ట్

సర్క్యూట్లు: నాణ్యత లేని వైరింగ్, ఎక్స్‌టెన్షన్ కార్డ్‌లు వాడటం వల్ల వైర్లు వేడెక్కి మంటలు చెలరేగే అవకాశం ఉంది.

రిఫ్రిజెరెంట్ లీకులు: ఏసీలో వాడే R32 లేదా R290 వంటి గ్యాస్‌లు మండే స్వభావం కలిగి ఉంటాయి. లీకేజీ ఉన్నప్పుడు చిన్న నిప్పురవ్వ తగిలినా పేలుడు సంభవించవచ్చు. అంతేకాకుండా సర్వీసింగ్ సమయంలో గ్యాస్‌ను తప్పుగా నింపడం వల్ల లోపలి పీడనం పెరిగి పైపులు పగిలిపోయే ప్రమాదం ఉంది.

ఈ సంకేతాలను లైట్ తీసుకోవద్దు

మీ ఏసీలో ఈ క్రింది మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి..

  • తీగలు కరుగుతున్నట్లుగా కాలిపోయిన వాసన రావడం.
  • యంత్రం నుండి అసాధారణమైన శబ్దాలు వినిపించడం.
  • సర్క్యూట్ బ్రేకర్ తరచుగా ట్రిప్ అవ్వడం.
  • ఏసీ ఆన్ చేసినప్పుడు లైట్లు మసకబారడం.

ముందస్తు జాగ్రత్తలు.. మీ ప్రాణాలకు రక్షణ

ప్రమాదాలను నివారించడానికి నిపుణులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.

విరామం ఇవ్వండి: ఏసీలను రోజంతా నిరంతరాయంగా వాడకుండా టైమర్ సెట్టింగ్స్ ద్వారా చిన్న చిన్న విరామాలను అనుమతించండి.

ఫిల్టర్ల శుభ్రత: ఎక్కువగా వాడే సమయంలో ప్రతి 10–15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయాలి.

డైరెక్ట్ ప్లగ్: ఏసీలను ఎక్స్‌టెన్షన్ బోర్డులలో కాకుండా నేరుగా 16A సాకెట్లలో మాత్రమే అమర్చాలి.

వెంటిలేషన్: అవుట్‌డోర్ యూనిట్‌కు తగినంత గాలి తగిలేలా, దానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.

ప్రొఫెషనల్ సర్వీసింగ్: వేసవి ఉధృతికి ముందే గ్యాస్ లెవల్స్, వైరింగ్‌ను నిపుణుల ద్వారా తనిఖీ చేయించుకోవాలి. విద్యుత్ హెచ్చుతగ్గులు ఉన్న చోట తప్పనిసరిగా వోల్టేజ్ స్టెబిలైజర్‌ను వాడాలి.

Follow Us