అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పి గన్నవరం అంబేద్కర్ కాలనీలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో అది పూర్తిగా కాలిపోయింది. అమలాపురం, కొత్తపేట మండలాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. వరికోతలు జరుగుతుండటంతో ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది.