Man lives with mother’s dead body: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇంట్లో తల్లి మృతదేహం దగ్గరే ఐదురోజులు గడిపాడు మతిస్థిమితం లేని వ్యక్తి. తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు స్థానికులు ప్రయత్నించగా అడ్డుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..జంగారెడ్డిగూడెంలోని ఓ అపార్ట్మెంట్లో మంజులాదేవి(79) మతిస్థిమితం లేని తన కొడుకు రవీంద్ర ఫణితో నివసిస్తున్నారు. ఇటీవల ఆమె అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అయితే తల్లి చనిపోయిన విషయం బయట చెప్పకుండా ఇంట్లో తల్లి మృతదేహం దగ్గరే గడిపాడు రవీంద్ర. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు ఆ ఇంట్లోకి ప్రవేశించడానికి స్థానికులు ప్రయత్నించగా అతను అడ్డుకున్నాడు. తల్లికి అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ అక్కడికి ఎవర్నీ రానివ్వలేదు.స
స్థానికులు సమాచారం ఇవవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారితో కూడా తన తల్లిని తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అతను అడ్డుపడ్డాడు రవీంద్ర. చివరికి మున్సిపల్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు పోలీసులు. రవీంద్రకు మతిస్థిమితం లేకనే ఇలా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. గతంలో తన సోదరి మరణించిన సమయంలోనూ రవీంద్ర ఇదే విధంగా డెడ్‌బాడీని కొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఉంచాడని స్థానికులు తెలిపారు.
Also Read :Man Kills Friend: భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం