వివాదాల బిగ్ బాస్-3 షో.. స్టిల్ సస్పెన్స్..

|

Jul 21, 2019 | 12:06 PM

నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్-3 షో పై సస్పెన్స్ కొనసాగుతోంది. కాస్ట్ కౌచింగ్, ఛాన్స్ కావాలంటే అలా వ్యవహరించక తప్పదంటూ తమను నిర్వాహకులు ఒత్తిడి చేశారంటూ ఓ యాంకర్, ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడం, నిర్వాహకులపై ఖాకీలు కేసులు నమోదు చేయడం, ఒక దర్శకుడు ఈ షో ని నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వీరు ధర్నాలు […]

వివాదాల బిగ్ బాస్-3  షో.. స్టిల్  సస్పెన్స్..
Follow us on

నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్-3 షో పై సస్పెన్స్ కొనసాగుతోంది. కాస్ట్ కౌచింగ్, ఛాన్స్ కావాలంటే అలా వ్యవహరించక తప్పదంటూ తమను నిర్వాహకులు ఒత్తిడి చేశారంటూ ఓ యాంకర్, ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడం, నిర్వాహకులపై ఖాకీలు కేసులు నమోదు చేయడం, ఒక దర్శకుడు ఈ షో ని నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వీరు ధర్నాలు చేయడం వంటి పరిణామాలతో ఈ షో మీద నీలినీడలు కమ్ముకున్నాయి. పైగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హోస్ట్ నాగ్ ఇంటి వద్ద, అన్నపూర్ణ స్థూడియో వద్ద ఆందోళన చేయడం,వారి అరెస్టులు వంటివి వరుసగా జరిగిన సంగతి తెలిసిందే. నాగార్జున మౌనాన్ని విద్యార్థి సంఘ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అటు- ఈ షో కి సంబంధించిన ప్రోమోలు నిన్న మొన్నటివరకు ప్రసారం కాగా.. తాజాగా వాటి ‘ జాడ ‘ ఈ ఛానల్ లో కనిపించలేదు. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కావలసి ఉన్న ఈ షోకి సంబంధించిన అధికారిక వార్త ఏదీ విడుదల కాలేదు. ఇద్దరు బాధితుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదులు స్వీకరించిన ఏడుగురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ.. ఏం తేల్చిందో ఇప్పటివరకు తెలియలేదు. ఈ కమిటీని సదరు ఛానల్ ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. ఆ కమిటీ ‘ విచారణ ‘ ఏమైందో ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరికొన్ని గంటల్లో ప్రసారం కానుందని భావిస్తున్న ఈ షో పై నీలి నీడలు మరింత దట్టంగా కమ్ముకున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.