దారుణం, ఫ్రీజర్ లో 74 ఏళ్ళ వృధ్ధుడు, సజీవంగా

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. 74 ఏళ్ళ వృధ్ధుడిని, అందులోనూ అస్వస్థుడుగా ఉన్న వ్యక్తిని ఫ్రీజర్ లో ఉంచేశారు ఆయన కుటుంబ సభ్యులు.. పైగా అందులోనే ఆయన మరణంకోసం వాళ్ళు వేచి చూశారట. ఈ ఫ్రీజర్ ని ఇతని సోదరుడు ఓ ఏజెన్సీ నుంచి తన ఇంటికి తీసుకువెళ్లాడని, అందులో బలవంతంగా ఆయనను పడుకోబెట్టాడని తెలిసింది. ఏజన్సీ ఉద్యోగి ఫ్రీజర్ ని తిరిగి తీసుకోవడానికి వచ్చి అందులో సజీవంగా  వృధ్ధుడిని చూసి షాక్ తిన్నాడు. వెంటనే […]

దారుణం, ఫ్రీజర్ లో 74 ఏళ్ళ వృధ్ధుడు, సజీవంగా

Edited By:

Updated on: Oct 14, 2020 | 4:47 PM

తమిళనాడు సేలం జిల్లాలో దారుణం జరిగింది. 74 ఏళ్ళ వృధ్ధుడిని, అందులోనూ అస్వస్థుడుగా ఉన్న వ్యక్తిని ఫ్రీజర్ లో ఉంచేశారు ఆయన కుటుంబ సభ్యులు.. పైగా అందులోనే ఆయన మరణంకోసం వాళ్ళు వేచి చూశారట. ఈ ఫ్రీజర్ ని ఇతని సోదరుడు ఓ ఏజెన్సీ నుంచి తన ఇంటికి తీసుకువెళ్లాడని, అందులో బలవంతంగా ఆయనను పడుకోబెట్టాడని తెలిసింది. ఏజన్సీ ఉద్యోగి ఫ్రీజర్ ని తిరిగి తీసుకోవడానికి వచ్చి అందులో సజీవంగా  వృధ్ధుడిని చూసి షాక్ తిన్నాడు. వెంటనే కేకలు  పెట్టి ఇరుగుపొరుగువారిని పిలిపించి అతడిని బయటకు తీసి రక్షించాడు. రాత్రంతా ఆ ముసలాయన ఆ ఫ్రీజర్ లోనే శ్వాస ఆడక నరకం అనుభవించాడట. హాస్పిటల్ లో చికిత్స పొందినప్పటికీ ఏదో వ్యాధి నయం కాకపోవడంతో అతడిని డాక్టర్లు డిశ్చార్జి చేసేశారని, అలాగే ఆయన సోదరుడు తన ఇంటికి తీసుకువఛ్చి ఇలా ఫ్రీజర్ లో ఉంచాడని తెలిసింది. బహుశా ఏదో మానసిక వ్యాధి కారణంగా ఆ వ్యక్తి ఇలా చేసినట్టు భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us