Corona: భారత్‌లో ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా సోకిందో తెలుసా..? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..

|

Feb 03, 2021 | 11:03 PM

Corona Cases In India: ప్రపంచ దేశాలను కరోనా ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భారత్‌లో ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించినా.. ఇతర దేశాలతో పోలిస్తే కాస్త తక్కువేనని చెప్పాలి...

Corona: భారత్‌లో ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా సోకిందో తెలుసా..? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..
Follow us on

Corona Cases In India: ప్రపంచ దేశాలను కరోనా ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భారత్‌లో ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించినా.. ఇతర దేశాలతో పోలిస్తే కాస్త తక్కువేనని చెప్పాలి. భారత ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై లాక్‌డౌన్‌ విధించడం, ప్రజలు కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం.. కారణం ఏదైనా, ప్రపంచదేశాలతో పోలీస్తే భారత్‌లో కరోనా మరణాలు కాస్త తక్కువగానే నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే భారత్‌లో అసలు చాలా మందికి తమకు కరోనా సోకిన విషయం కూడా తెలియదని తాజా సర్వేలో తేలింది. స్వతహాగా శరీరంలో సరిపడ నిరోధక శక్తి ఉండడంతో చాలా మందిలో కరోనా లక్షణాలు కూడా బయటపడలేదని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌లో అసలు ఎంత మందికి కరోనా సోకి ఉంటుందన్న అంశంపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. 135 కోట్ల మంది ఉన్న భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు 30 కోట్ల మందికి కరోనా సోకి ఉండొచ్చని తేలింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఓ సర్వేను నిర్వహించగా అందులో 30వేల మంది భాగమయ్యారు. వీరిలో 15 మంది భారతీయుల్లో ఒకరిలో కొవిడ్‌ యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు. త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సర్వేకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

Also Read: Coronavirus Cases World: ప్రపంచ కరోనా అప్‌డేట్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!