విషాదం : చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

|

Oct 01, 2020 | 6:19 PM

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు, ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు విడిచారు. 

విషాదం :  చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
Follow us on

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు, ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు విడిచారు.  దండుపల్లి పంచాయతీ పిట్టలవాడ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలవాడకు చెందిన రవి (6), నవీన్‌ (5), అఖిల(6) అనే చిన్నారులు మరో ఇద్దరితో కలిసి గురువారం ఆడుకుంటూ చెరువు దగ్గరలోకి వెళ్లారు.

ఈ క్రమంలో నీటిలో రాళ్లు విసురుతూ ఆడుకుంటుండగా.. రవి, నవీన్‌, అఖిల ఒకరి తర్వాత ఒకరు చెరువులో మునిగిపోయారు. దీంతో షాక్ కు గురైన మరో ఇద్దరు చిన్నారులు అక్కడి నుంచి ఇళ్లకు చేరుకుని తమ మిత్రులు నీట మునిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. స్థానికులు, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకునేసరికి చిన్నారులు చనిపోయి నీటిలో తేలియాడుతూ కనిపించారు. దీంతో వారి తల్లిదండ్రులు కంటతడి పెట్టిన తీరు కదిలించింది. ఈ ఘటనతో దండుపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకున్నాయి. కేసు నమోదు చేసుకుని మృతదేహాల్ని పోస్టు మార్టం నిమిత్తం తూప్రాన్‌ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Also Read :

దేశంలో కరోనా కలవరం

శీతాకాలంలో కరోనా ముప్పు మరింత అధికమట !