2020 Lockdown Lesson: మరి కొన్ని గంటల్లో 2020 సంవత్సరం ముగియబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది మొత్తం ప్రజలు కష్టాలతోనే అనుభవించారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేసింది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా జనాలు ఇప్పుడిప్పుడు కాస్త ఇబ్బందుల నుంచి తెరుకుంటున్న తరుణంలో మరో కొత్త వైరస్ జనాల్లో గుబులు రేపుతోంది.
దేశంలో లాక్‌డౌన్ ఉన్న సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ కాలం గడిపారు. కానీ ఇంట్లో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. ఒకప్పుడు ఒక రోజు బస్సులు బంద్ ఉంటే జనాలు తల్లడిల్లిపోయేవారు. అలాంటిది లాక్ డౌన్ సమయంలో ఏకంగా కొన్ని నెలల పాటు బస్సులు, షాపులు, ఇతర రంగాలు అన్ని మూతపడ్డా కూడా మనం బతకగలం అనే అనే నమ్మకం వచ్చింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక స్వప్నం కాదని, ఇలాంటి కష్టతరమైన సమయంలో ఎంతో అవసరమని నేర్పించింది లాక్‌డౌన్. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కాలుష్యం కూడా పూర్తిగా తగ్గిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక స్వప్నం కాదని, సంకట సమయంలో ఎంతో అవసరమని లాక్‌డౌన్ ద్వారా నేర్చుకున్నాము. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే వర్క్ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చని నిరూపించుకున్నారు.
అలాగే ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. లాక్‌డౌన్ సమయంలో నిమిషాల్లోనే పథకాలు రూపొందించి పేదలకు ఆదుకోవడం లాంటివి సాధ్యమని నిరూపితమైంది. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందులకు గురవుతూ పేదలకు తినడానికి తిండి లేకున్నా అప్పటికప్పుడు ఆహారాన్ని తయారు చేసి పేదలకు అందించడం సాధ్యమనేది లాక్‌డౌన్ ద్వారా తెలిసింది. నిమిషాల్లోనే ఆహారం తయారు చేసుకోవడం, నిమిషాల్లోనే మాస్కులు, ఇతర వస్తువులు అందించడం సాధ్యమవుతుందని నేర్చుకున్నాము.
లాక్‌డౌన్ సమయంలో పొదువు విలువ చాలా తెలిసి వచ్చింది. కష్టకాలంలో డబ్బులను తెలివిగా ఎలా ఖర్చు పెట్టాలో లాక్‌డౌన్ వల్ల నేర్చుకున్నాము. లాక్‌డౌన్‌కు ముందు విచ్చలవిడిగా ఖర్చు చేసిన జనాలు .. లాక్‌డౌన్ వల్ల పొదుపుగా వాడుకోవడం నేర్చుకున్నారు. ప్రతీ వారం సినిమాలు చూడకపోయినా, షాపింగ్‌లు చేయకపోయినా రెస్టారెంట్లకు వెళ్లకపోయినా బతకగలమని 2020లో లాక్‌డౌన్ నేర్పింది.
ప్రస్తుతం కాలంతో పోటాపోటీగా పరుగెడుతున్న ఇంటిల్లిపాది ఒక చోట ఉండి గడిపే సమయం చాలా తక్కువ. అలాంటిది ఇంట్లో భార్యాభర్తలను కూర్చోబెట్టి కబుర్లు చెప్పుకునేలా చేసింది లాక్‌డౌన్. వాట్సాప్‌లలో తప్ప నేరుగా కలవకపోయినా కుటుంబ సభ్యులందరినీ సైతం ఒక్క చోట కలిపేలా చేసింది. ఏ క్షణంలో ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొవాలన్న గుణపాఠాన్ని నేర్పింది.
బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండగలమన్న నమ్మకం కలిగించింది లాక్ డౌన్. కొందరు మద్యం ప్రియులు రోజు వారీగా మద్యం లేకుండా ఉండలేరు. లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. అలాంటి సమయంలో కూడా మద్యం లేకుండా ఉండగలను అనే ధైర్యం లాక్‌డౌన్ కలిగించింది. కొందరికి రోజు బయటకు వెళ్లనిది గడవదు. లాక్‌డౌన్ సమయంలో చాలా రోజులుగా మద్యం షాపులు మూతపడినా మద్యం తాగకుండా ఉండగలిగారు. అందుకే 2020లో జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎన్నో నేర్చుకున్నామనే చెప్పాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినా.. ఎదుర్కొంటామనే దైర్యం 2020 సంవత్సరం ప్రతి ఒక్కరిలో కలిగించింది.