ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ పోలీసుల ఎదుట 15 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరి నుంచి మూడు రైఫిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మహిళల్లో ఒకరిపై రూ. లక్ష రివార్డు ఉందని.. నక్సల్ చేతన నాట్య మండలికి ఈమె కమాండర్‌గా వ్యవహరిస్తోందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేసి.. ఉపాధి కల్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు.