ఏపీలో హంగ్‌ మాత్రం రాదు: లగడపాటి

Lagadapati pressmeet, ఏపీలో హంగ్‌ మాత్రం రాదు: లగడపాటి

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని.. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని, గజిబిజిగా తీర్పు ఇవ్వలేదన్నారు. శనివారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రంతోనూ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు.. కేంద్రం, రాష్ట్ర సహకారంతోనే సాధ్యమన్న ప్రత్యేక దృష్టితో ప్రజలు ఈ ఎన్నికల్ని చూస్తున్నారన్నారు. కాగా ప్రవాసాంధ్రుల్లోనూ ఫలితాలపై ఉత్కంఠ ఎక్కవగా ఉందని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై తన సర్వేను రేపు సాయంత్రం 6గంటలకు తిరుపతిలో వెల్లడిస్తానననారు . ప్రధానంగా మూడు పార్టీలే రాష్ట్రంలో పోటీలో పడ్డాయని… . తాను చెప్పబోయే ఫలితాలు రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *