తెలంగాణలో లాక్‌డౌన్‌, సడలింపులపై కేటీఆర్‌ ట్వీట్‌

లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్ర మార్గదర్శకాలు విడుదల అయిన నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌, సడలింపులపై కేటీఆర్‌ ట్వీట్‌
Follow us

|

Updated on: May 18, 2020 | 12:13 PM

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వెయ్యికి పైగానే నమోదు అవుతున్నాయి. మరో వైపు మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా లాక్ డౌన్ పూర్తి కాగా మే 18నుంచి లాక్ డౌన్ 4 ప్రకటించిన కేంద్రం మే 31 వరకు పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ లో కేంద్ర ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్ర మార్గదర్శకాలు విడుదల అయిన నేపథ్యంలో అవసరమైన సడలింపులపై అనేక సలహాలు వస్తున్నాయని కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. లాక్‌డౌన్‌ సడలింపులపై సాయంత్రం 5 గంటలకు జరిగే మంత్రివర్గ భేటీలో చర్చిస్తామన్నారు. సడలింపులపై అందరి సలహాలు పరిగణలోకి తీసుకుంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.