మెట్రో వర్కరే కాదు.. మరో మైకెల్ జాక్సన్‌ కూడా!

KTR applauds a Metro Rail worker for his amazing dance talent, మెట్రో వర్కరే కాదు.. మరో మైకెల్ జాక్సన్‌ కూడా!

హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో వందల మంది కార్మికులు డైలీ పనిచేస్తూ ఉంటారు. రోజంతా కఠోర శ్రమ చేసే వాళ్లు మధ్యమధ్యలో ఆటవిడుపు కోసం సరదాగా పాటలు పాడటం, డాన్స్ చేయడం వంటివి చేస్తుంటారు.  అలానే ఓ నిర్మాణ కార్మికుడు… లంచ్ బ్రేక్‌లో తన తోటి వర్కర్ల ముందు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆ డాన్స్ చూస్తే… సినిమాల్లో హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు మైకేల్ జాక్సన్ స్టెప్పుల్ని దించేశాడు. అతని స్టెప్స్ చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.  ఓ కర్రతో ఎంతో ఈజీగా అతను ఆ స్టెప్పులు వెయ్యడం చూస్తే… అతను రాక్ స్టారా  అన్న డౌట్ రాక మానదు. తమ ప్రాజెక్టులో ఇలాంటి టాలెంటెడ్ వర్కర్లు ఉండటంపై ఎంతో సంతోషిస్తున్నామనీ, అతన్ని చూసి గర్వపడుతున్నామనీ చెబుతూ… మెట్రో రైల్ ఎండీ… ఆ డాన్స్ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… సూపర్ టాలెంట్ అని ప్రశంసించారు. రీట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *