Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు అందర్నీ పాస్ చేసినట్టు ప్రకటించింది.
  • కరోనా వైరస్‌ను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తున్నదని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Koratala Siva: దిల్ రాజుకు షాక్ ఇచ్చిన కొరటాల..!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలే కాకుండా మరో బాధ్యతను కొరటాలనే తీసుకున్నారట
Koratala Siva news, Koratala Siva: దిల్ రాజుకు షాక్ ఇచ్చిన కొరటాల..!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలే కాకుండా మరో బాధ్యతను కొరటాలనే తీసుకున్నారట. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్‌ను మొత్తం ఇప్పుడు కొరటాలనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొరటాలకు రామ్ చరణ్ పూర్తి అధికారాలు ఇవ్వడంతో.. డిస్ట్రిబ్యూషన్ హక్కులు, శాటిలైట్ హక్కులు, థియేట్రికల్ హక్కులు ఇలా ప్రతీది తానే చూసుకుంటున్నారట కొరటాల.

అంతేకాదు ఇప్పటి నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ప్రారంభించిన కొరటాల.. తనకు సన్నిహితంగా ఉన్న వారికి డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తున్నారట. అయితే ఈ మూవీ నైజాం, గుంటూరు హక్కులను తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు చాలా ప్రయత్నించారట. కానీ కొరటాల మాత్రం ఆయనను పక్కనపెట్టారట. ఈ క్రమంలో నైజాం రైట్స్ లక్ష్మణ్(దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల ఈయన బయటకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి)కు, ఉత్తరాంధ్ర హక్కులను సుధాకర్ అనే తన సన్నిహితుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు కాస్త చిన్నబుచ్చుకున్నారని కూడా సమాచారం. ఇదిలా ఉంటే దిల్ రాజు సంస్థ నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్.. పవన్ కల్యాణ్- క్రిష్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read This Story Also: దిల్ రాజుకు చెక్ పెట్టేందుకు అతడికి సపోర్ట్ చేస్తున్నారా..!

Related Tags