Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

మా ఇద్దరికి ఎప్పుడు ఆ అవసరం రాలేదు: విరుష్క

Kohli about proposing Anushka, మా ఇద్దరికి ఎప్పుడు ఆ అవసరం రాలేదు: విరుష్క

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలు 2017లో పెళ్లి చేసుకొని ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ ఇంతవరకు అనుష్కకు అఫిషియల్‌గా ప్రపోజ్ చేయలేదట. ఈ విషయాన్ని రీసెంట్‌గా కోహ్లీ రివీల్ చేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ ఛత్రీతో కోహ్లీ దంపతులు లైవ్ సెషన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. తానెప్పుడూ మోకాళ్లపై నిలబడి అనుష్కకు ప్రపోజ్ చేయలేదని అన్నారు. ఎందుకంటే తామిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఈ విషయంలో ఇద్దరం పక్కాగా ఉన్నాం కాబట్టే.. తనకెప్పుడూ అనుష్కకు ప్రపోజ్‌ చేసే అవసరం రాలేదని అన్నారు.

మాకు ప్రతిరోజు వాలంటీన్స్‌ డేనే. అనుష్క చెప్పినట్లుగా ప్రపోజ్‌ చేసుకునే అవసరం మాకు రాలేదు. ఎందుకంటే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆ విషయంలో మా ఇద్దరికి ఎలాంటి సందేహాలు లేవు. మా జీవితంలో అన్ని సాఫీగా జరుగుతుండగా.. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు చాలా ఎగ్జైట్ అయ్యాం అని కోహ్లీ అన్నారు.

కాగా అనుష్క నిర్మించిన పాతాల్ లోక్ సిరీస్ ఇటీవల అమెజాన్‌లో విడుదల కాగా.. దానిపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇండియాలో నిర్మితమైన బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ అదేనని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అంతేకాదు సినిమా సెలబ్రిటీలు సైతం ఈ సిరీస్‌ని ప్రశంసించారు. అయితే ఈ సిరీస్‌లో ఓ డైలాగ్‌ తమ వర్గాన్ని కించపరిచే విధంగా ఉందంటూ  అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గూర్ఖా యూత్ అసోసియేషన్, అనుష్కపై ఆన్‌లైన్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Read This Story Also: దారుణం.. క్వారంటైన్‌లో ఉండమన్నందుకు మాకుమ్మడి దాడి..!

Related Tags