Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

దారుణం.. క్వారంటైన్‌లో ఉండమన్నందుకు మూకుమ్మడి దాడి..!

క్వారంటైన్‌ సెంటర్‌లో ఉండమన్నందుకు ఇద్దరిని హతమార్చారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లాతూర్ జిల్లా బోలేగావూన్
Two killed in Maharashtra, దారుణం.. క్వారంటైన్‌లో ఉండమన్నందుకు మూకుమ్మడి దాడి..!

క్వారంటైన్‌ సెంటర్‌లో ఉండమన్నందుకు మూకుమ్మడిగా దాడి చేసి ఇద్దరిని హతమార్చారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లాతూర్ జిల్లా బోలేగావూన్‌ ప్రాంతానికి చెందిన విద్యామన్‌ బరందే అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే అతడు గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యామన్‌ను క్వారంటైన్ సెంటర్‌లో ఉండాలని షాహాజీ పాటిల్ అనే వ్యక్తి సూచించాడు. దానికి విద్యామన్ ససేమిరా అన్నాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.

దీంతో కోపాద్రిక్తుడైన విద్యామన్ తన ఊరి పక్కనే ఉన్న సోదరి గ్రామమైన చండోరికి వెళ్లాడు. అక్కడ జరిగిన విషయం చెప్పి కొంతమందిని వెంట పెట్టుకొని బోలేగావూన్‌కి తిరిగి వచ్చాడు. ఆ తరువాత పాటిల్‌ ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్లి మాకుమ్మడిగా దాడి చేశారు. ఈ క్రమంలో పాటిల్ పక్కనే అతడి బంధువు వైభవ్ ఉండగా.. అతడిపై కూడా మూకదాడి చేశారు. వారి దెబ్బలను తాళలేక పోయిన ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

Read This Story Also: దిల్ రాజు రిక్వెస్ట్.. ఓకే చెప్పిన పవన్ కల్యాణ్..!

Related Tags