ట్రెండింగ్: కరోనాను మించిపోయిన కిమ్.. అసలు ఏమయ్యాడు.?

కిమ్ జాంగ్ ఉన్… నార్త్ కొరియాను పాలిస్తూ ప్రపంచదేశాలను వణికిస్తున్న ఓ నియంత. చూడడానికి ఐదు అడుగులు మాత్రమే ఉన్నా.. ఆయన చర్యలకు, చేష్టలకు అగ్రరాజ్యం అధినేత కూడా భయపడాల్సిందే. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతున్నా సరే.. కిమ్‌కు అసలు ఏమైంది అనే విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు అతడు బ్రతికే ఉన్నాడని చెబుతుంటే.. సీఎన్ఎన్ సహా అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం కిమ్ చావు బతుకుల […]

ట్రెండింగ్: కరోనాను మించిపోయిన కిమ్.. అసలు ఏమయ్యాడు.?
Follow us

|

Updated on: Apr 26, 2020 | 1:01 PM

కిమ్ జాంగ్ ఉన్… నార్త్ కొరియాను పాలిస్తూ ప్రపంచదేశాలను వణికిస్తున్న ఓ నియంత. చూడడానికి ఐదు అడుగులు మాత్రమే ఉన్నా.. ఆయన చర్యలకు, చేష్టలకు అగ్రరాజ్యం అధినేత కూడా భయపడాల్సిందే. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతున్నా సరే.. కిమ్‌కు అసలు ఏమైంది అనే విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు అతడు బ్రతికే ఉన్నాడని చెబుతుంటే.. సీఎన్ఎన్ సహా అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం కిమ్ చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటున్నాయి. అటు నార్త్ కొరియా రిపోర్టర్ ఒకరు ఆమె యూట్యూబ్ ఛానల్‌లో కిమ్ ఎప్పుడో చనిపోయాడు. అయితే అక్కడ అధికారులు మాత్రం దాన్ని దాచిపెడుతున్నారు అని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే నిన్నటి నుంచి కిమ్‌ బ్రతికాడా.? చచ్చాడా.? అనే దానిపై ట్విట్టర్‌లో ట్రెండ్ నడుస్తోంది. #KIMJONGUNDEAD, #KimJongUn,#KimJongUn #KimJungUn #KimJong #KimJungUnDead అనే హ్యాష్ ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అటు కిమ్ తర్వాత అతడి సోదరి కిమ్ యో జోంగ్ అధ్యక్షురాలు అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె గురించి చెప్పాలంటే.. అన్న కంటే పరమ కఠినాత్మురాలని అక్కడి ప్రజలు అంటున్నారు. కాగా, కిమ్‌కు సంబంధించిన ప్రైవేటు ట్రైన్ ఒకటి వోన్‌సన్‌ రిసార్ట్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్నట్లు స్థానిక ఛానల్ కొన్ని గూగుల్ మ్యాప్ ఫోటోలు విడుదల చేసింది. అయితే దీన్ని ఆధారం చేసుకుని మాత్రం అతడు అక్కడే ఉన్నాడని చెప్పలేమని వెల్లడించింది.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!

విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..

ఆర్‌సీబీని విడిచిపెట్టనుః కోహ్లీ

అదిరిపోయే ఆఫర్.. ఇంటి పట్టునే ఉంటే ఒక కోడి, పది కోడిగుడ్లు ఫ్రీ..