రాకీభాయ్‌‌ బర్త్‌డేకు అదిరిపోయే గిప్ట్ ఇస్తున్న ‘కేజీఎఫ్ 2’ చిత్ర యూనిట్.. వచ్చే ఏడాది జనవరి 8న సినిమా టీజర్ విడుదల..

కన్నడ సూపర్‌ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

  • uppula Raju
  • Publish Date - 12:33 pm, Thu, 3 December 20

కన్నడ సూపర్‌ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇందులో యశ్, రాకీ భాయ్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. అంతేకాకుండా సలాం రాకీభాయ్ అంటూ కుర్రకారును హుషారెత్తించారు. తెలుగు,తమిళం,కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బంగారు గనుల నేపథ్యంలో.. సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా మారిపోయారు.

ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 కూడా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్ సిటీలో జరుపుతున్నారు. ఇందుకోసం యశ్ ఇటీవల హైదరాబాద్ కూడా వచ్చారు. ఇందులో చాలా పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారు. బాలీవుడ్‌ బడా హీరో సంజయ్ దత్ ఈ సినిమాకు పెద్ద అట్రాక్షన్‌గా నిలవనున్నారు. ఇందులో అత్యంత క్రూరంగా ఉండే విలన్ పాత్ర అధీరాగా సంజయ్‌దత్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. కేజీఎఫ్ 2 లో రాకీభాయ్ ఏం చేశాడోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 సినిమా టీజర్ డేట్ ఫిక్స్ అయిందని సమాచారం తెలిసింది. వచ్చే ఏడాది జనవరి8న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఎందుకంటే జనవరి 8 ఈ సినిమా హీరో యశ్ పుట్టినరోజు. దీంతో యశ్ కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న యశ్ అభిమానులు సంబరపడిపోతున్నారు.