Breaking News
  • రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
  • ముంబై దాదార్‌లోని శుష్రుషా ఆస్పత్రి నర్సులందరినీ క్వారంటైన్‌కు తరలింపు. ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో చర్యలు. కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఇప్పటికే ఉన్న రోగులను 48 గంటల్లో డిశ్చార్జి చేయాలని ఆదేశాలు. క్వారంటైన్ చేసిన నర్సులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశం.
  • కరోనా నుంచి పూర్తిగా కొలుకోక ముందే కొత్తగూడెం డిఎస్పీ డిశ్చార్జి.. అదే పేరుతో ఉన్న మరోవ్యక్తికి నెగిటివ్ రావటం తో డిఎస్పీ డిశ్చార్జి.. రిపోర్టులో డిఎస్పీకి పాజిటివ్ అని తేలటంతో మళ్ళీ వెనక్కి రప్పిస్తున్న వైద్యులు.. నిన్న ఇంటికి వెళ్లినా డిఎస్పీ క్వారంటైన్ లొనే ఉన్నారు..
  • కరోనాతో బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కుట్ర. కుట్రను భగ్నం చేసిన బిహార్ పోలీసులు. నేపాల్ సరిహద్దుల ద్వారా కరోనా పాజిటివ్ ఉగ్రవాదులను భారత్‌కు పంపే అవకాశం. తద్వారా వైరస్ విస్తృతి చేయాలన్నది పాక్ కుట్రగా అనుమానం.
  • కరోనా ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రంజిత్ రావు.

కెజిఎఫ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

KGF 2 Release Postponed, కెజిఎఫ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

KGF 2 Release Postponed: కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజిఎఫ్-1’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియన్ మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘కెజిఎఫ్’ చాప్టర్ 2 సినిమా విడుదల తేదీని మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ ఆలస్యం కావడం వల్ల ఈ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, మాళవిక అవినాష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Related Tags