Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

కీర్తి పెళ్లి పుకార్లు లీక్.. ఆ కమెడియన్ పనేనా..!

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ పెళ్లికి సిద్దమవుతోందని.. ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి కుమారుడితో మహానటి వివాహం ఖరారైందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.
Keerthy Suresh marriage rumors, కీర్తి పెళ్లి పుకార్లు లీక్.. ఆ కమెడియన్ పనేనా..!

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ పెళ్లికి సిద్దమవుతోందని.. ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి కుమారుడితో మహానటి వివాహం ఖరారైందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక వీటిపై కీర్తి కూడా క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నానని.. పెళ్లికి టైం లేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి పుకార్లు ఎలా వచ్చాయో కూడా అర్థం కాలేదని ఈ బ్యూటీ వాపోయారు. ఇదిలా ఉంటే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ పుకార్ల వెనుక ఓ కమెడియన్ ఉన్నారట.

పలు చిత్రాల్లో నటించి.. ప్రస్తుతం బిజీ కమెడియన్‌గా పేరొందిన సతీష్‌ ముత్తుకృష్ణన్, కీర్తి సురేష్‌ పెళ్లి పుకార్లను క్రియేట్ చేసినట్లు టాక్‌. ఈ క్రమంలో అతడికి ఫోన్ చేసిన కీర్తి, తిట్టినట్లు తెలుస్తోంది. అయితే సతీష్‌ ఈ పుకార్లను ఎందుకు లీక్ చేశాడన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదని కోలీవుడ్‌ సమాచారం. మరి ఇందులో నిజమెంత..? కీర్తి పెళ్లి వార్తల వెనకున్నది సతీష్‌నా..? ఈ రూమర్లు ఎందుకు వచ్చాయి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం త్వరలో తెలుస్తాయేమో చూడాలి. కాగా కీర్తికి, సతీష్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు మంచి స్నేహితులు కాగా గతంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఓ మూవీ పూజా కార్యక్రమాల్లో వీరిద్దరు పాల్గొనగా.. ఆ ఫొటోలతో వీరిద్దరు పెళ్లి జరిగినట్లు కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను చూసి తాము నవ్వుకున్నామని.. తన తల్లి మేనక కూడా వాటిని చూసి నవ్వి ఊరుకుందని కీర్తి తెలిపిన విషయం తెలిసిందే.

Read This Story Also: ముగిసిన ఎన్‌కౌంటర్‌.. పాక్ తీరుపై మండిపడుతున్న సైన్యం..

Keerthy Suresh marriage rumors, కీర్తి పెళ్లి పుకార్లు లీక్.. ఆ కమెడియన్ పనేనా..!

Related Tags