ఇండియాలో ఇక ‘కశ్మీర్’ ఉండదు: వైగో సంచలన వ్యాఖ్యలు

Kashmir will not be Part of India on 100th Independence Day says MDMK Chief Vaiko, ఇండియాలో ఇక ‘కశ్మీర్’ ఉండదు: వైగో సంచలన వ్యాఖ్యలు

కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే అక్కడి వాతావరణం సర్ధుమణుగుతోంది. భద్రతాబలగాలు.. ఎక్కడిక్కడ అల్లరి మూకలను కట్టడి చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్.. కశ్మీర్ మాదంటూ.. కవ్వింపు చర్యలను పాల్పడుతోంది. ఇలా చేస్తే.. ఊరుకోమంటూ.. ఇండియా కూడా ధీటుగా స్పందిస్తోంది. ఓవైపు భారత్ ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపి.. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని కేంద్రం స్పష్టం చేసింది. మరో పక్క ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేసి మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. కానీ భారతదేశంలోనే అంతర్ముఖంగా.. కోల్డ్ వార్ జరుగుతోంది.

ఇండియాలో కశ్మీర్ ఇక ఉండదని ఎండీఎంకే అధినేత వైగో సంచలన ఆరోపణలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై 110వ జయంతి ఉత్సవాల ఏర్పాటు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్‌ అంశంపై తన అభిప్రాయం స్పష్టంగా ఉందని.. బీజేపీ వాళ్లు కశ్మీర్‌పై బురద చల్లారని అన్నారు. కశ్మీర్‌ ప్రజలకు ఇష్టం లేకుండా బీజేపీ వారిని.. బాధపెడుతుందని పేర్కొన్నారు. భారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్‌లో కశ్మీర్ ఉండదని తీవ్రంగా విమర్శలు చేశారు. అలాగే.. కశ్మీర్‌ అంశంలో కాంగ్రెస్ తప్పు కూడా ఉందని.. బీజేపీ 70 శాతం చేస్తే.. కాంగ్రెస్‌ని 30 శాతం తప్పుపడతానని అని వ్యాఖ్యానించారు ఎండీఎంకే అధినేత వైగో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *