Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

కంగనా మరీ అంత టర్నింగ్ ఇచ్చుకోకు

kangana ranaut, కంగనా మరీ అంత టర్నింగ్ ఇచ్చుకోకు

ఆత్మవిశ్వాసం అవసరమే అయినా అది హద్దులు దాటితే ఎలా ఉంటుందో కంగనాని చూస్తే తెలుస్తుందంటున్నారు బాలీవుడ్‌ జనాలు. ‘మణికర్ణిక’ సినిమాలో కొన్ని సీన్లు షూట్‌ చేయడంతో కంగన తనో పెద్ద దర్శకురాలైపోయినట్లు తెగ ఫోజు కొడుతోందట. ఆ క్రమంలోనే త్వరలో తాను దర్శకత్వం చేయబోయే సినిమా… బాహుబలి, పద్మావతిని మించి ఉంటుందని గొప్పలు పోతోంది. ఆ రెండు సినిమాలు ఎంత విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటి విజయం వెనుక దర్శకుల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి దర్శకులతో తనని తాను పోల్చుకోవడమే కాదు. వారిని తక్కువ చేసి మాట్లాడుతున్న కంగనాపై సినీ అభిమానులు గుర్రుగా ఉన్నారట. మొత్తానికి కంగనా మాటలు కోటలు దాటుతున్నాయనీ, ఇప్పటికైనా వాటిని మానుకోకపోతే ముప్పు తప్పదని కొందరు హెచ్చరిస్తున్నారు.

Related Tags