సరికొత్త రూల్: నో హెల్మెట్.. నో పెట్రోల్

No Helmet No Petrol Campaign Organises By Kalaburagi Police, సరికొత్త రూల్: నో హెల్మెట్.. నో పెట్రోల్

కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కర్ణాటక పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. వాహనదారులు హెల్మెట్‌ను తప్పక ధరించే విధంగా సరికొత్త రూల్‌ను అమల్లోకి తేనున్నారు.

హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయకూడదని కలబురిగి పోలీసులు పెట్రోల్ బంకుల్లో ఆంక్షలు విధించనున్నారు. ఈ విషయంపై పోలీసు కమీషనర్ ఎంఎన్ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ..కలబురిగి పోలీసు కమీషనరేట్ పరిధిలో నో హెల్మెట్-నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 29 నుంచి ఈ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కాగా సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *