Breaking News
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.
  • టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి భూకబ్జా, కేసుల చిట్టా. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.
  • గోపన్‌పల్లి భూవివాదంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ . కొండల్‌రెడ్డితో అప్పటి తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి కుమ్మక్కయ్యారు. గోపన్‌పల్లి భూ వివాదంలో అప్పటి తహశీల్దార్‌ అవకతవకలకు పాల్పడ్డారు. కొండల్‌రెడ్డికి సంబంధం లేని భూమిని శ్రీనివాస్‌రెడ్డి మ్యుటేషన్‌ చేయించారు. -టీవీ9తో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌. డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి తన అధికారాలకు విరుద్ధంగా.. రికార్డుల్లో లేనివ్యక్తి భూమిని కొండల్‌రెడ్డికి మ్యుటేషన్ చేయించారు. ఈ వివాదంలో మరో ఇద్దరు తహశీల్దార్ల పాత్ర కూడా గుర్తించాం. తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి లేఖ రాశాం-టీవీ9తో రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్.
  • గోపన్‌పల్లి భూవివాదంలో గతంలోనే రేవంత్‌రెడ్డిపై కేసులు. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.

‘బాలీవుడ్ క్రిటిక్స్’, ‘ప్రేమ’పై ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

Sandeep Reddy Vanga, ‘బాలీవుడ్ క్రిటిక్స్’, ‘ప్రేమ’పై ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అయితే విడుదలకు ముందు ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. అంతేకాదు రిలీజ్ తరువాత ఈ సినిమాపై కొందరు ప్రశంసలు కురిపించినప్పటికీ.. మరికొందరు మాత్రం విమర్శలు కురిపించారు. ఏదేమైనా అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద అద్భుత కలెక్షన్లను సాధించి, విజయ్ దేవరకొండకు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. అంతేకాదు టాలీవుడ్‌ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి ఇటీవల విడుదల చేశారు. అందులో షాహిద్ కపూర్, కియారా అద్వాణీ జంటగా నటించగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాకు అక్కడ కూడా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఫెమినిస్ట్‌లు ఈ సినిమాపై తిట్టిపడేశారు. మహిళల మనోభావాలను కించపరిచేలా, మహిళలపై లైంగిక వేధింపులు ప్రోత్సహించేలా కొన్ని సీన్లు ఉన్నాయంటూ వారు కామెంట్లు చేశారు. అయినప్పటికీ అక్కడ కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు 218కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్‌లో ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో.. త్వరలో 300కోట్లను కొల్లగొట్టి.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ కామెంట్లపై.. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ను కొట్టే సన్నివేశంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘ఒకవేళ మనం ఎవరినైనా గాఢంగా ప్రేమించి వారితో రిలేషన్‌లో ఉన్నప్పుడు.. ఆ అమ్మాయిని ఇష్టమైన చోట పట్టుకునేంత బంధం, ముద్దు పెట్టుకునే ప్రేమ, ఒకరినొకరు కొట్టుకునేంత స్వేచ్ఛ కూడా లేకపోతే.. ఆ బంధంలో అర్థం కనిపించదు’’ అని సందీప్ పేర్కొన్నాడు. ‘‘ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి నిజమైన ప్రేమ గురించి తెలీదేమో. సినిమాపై అలా మాట్లాడే ఫెమినిస్ట్‌లు వారి సైడ్ నుంచి మాత్రమే ఆలోచిస్తారు’’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ 2స్టార్లు ఇవ్వడంపై కూడా ఆయన స్పందించారు. ‘‘లావుగా ఉన్న ఓ క్రిటిక్(రాజీవ్ మసంద్‌ను ఉద్దేశించి) నా సినిమాకు 2స్టార్ల రేటింగ్ మాత్రమే ఇచ్చారు కానీ ప్రేక్షకులు మాత్రం 200కోట్లను ఇచ్చారు. ఇక అతనే కొన్ని స్టుపిడ్ సినిమాలకు మూడు స్టార్లు ఇచ్చాడు’’ అని వెల్లడించాడు. ఈ సందర్భంగా సంజు మూవీని ఉదాహరణగా చూపించిన సందీప్ రెడ్డి.. అందులో కొన్ని అసభ్యకర డైలాగ్‌లు ఉంటే క్రిటిక్స్ వాటికి విజిల్స్ వేసి మరీ జై కొట్టారు అని చెప్పుకొచ్చాడు. అయితే సందీప్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై నెటిజన్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నారు. కొందరేమో సందీప్ రెడ్డి వంగాకు మద్దతుగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరమే అతడికి కొంచెం కూడా సిగ్గు లేదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Related Tags