రిలీజైన కె.విశ్వనాథ్ బయోపిక్ “విశ్వదర్శనం” టీజర్

హైదరాబాద్‌: ప్రస్తుతం అన్ని భాషల్లోను బయోపిక్స్ ట్రెండ్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ పరంపర ఎక్కువ కొనసాగుతుంది. అదే కోవలో కళా తపస్వి,  దాాదాసాహెబ్ పాల్కే  అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వ దర్శనం’. జనార్థన మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ’ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. రాధికా […]

రిలీజైన కె.విశ్వనాథ్ బయోపిక్ విశ్వదర్శనం టీజర్
Follow us

|

Updated on: Feb 19, 2019 | 11:53 AM

హైదరాబాద్‌: ప్రస్తుతం అన్ని భాషల్లోను బయోపిక్స్ ట్రెండ్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ పరంపర ఎక్కువ కొనసాగుతుంది. అదే కోవలో కళా తపస్వి,  దాాదాసాహెబ్ పాల్కే  అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘విశ్వ దర్శనం’. జనార్థన మహర్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ’ అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌, సీతారామశాస్త్రి తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌లో వివరించారు.

విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను టీజర్‌లో చక్కగా చూపించారు. ‘సినిమా అనే ఓ బస్సును పట్టుకుని…సినిమా చూసే ప్రేక్షకులు భక్తులు అనుకుని… నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?’ అంటూ చివర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.