Breaking News
  • పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. వాహనదారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు. నదిలోకి దూకి యువతిని కాపాడిన ఏఎస్సై మాణిక్యాలరావు. మాణిక్యాలరావును అభినందించిన పోలీసులు, స్థానికులు.
  • చెన్నై: సినీ నటుడు రాఘవ లారెన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. డబ్బు కోసమో, పబ్లిసిటీ కోసమో రజినీ రాజకీయాలకు వస్తున్నారని.. కొందరు మాట్లాడటం దురదృష్టకరం-రాఘవ లారెన్స్‌. రజినీకి రాజకీయాలు తెలియదు అనడం హాస్యాస్పదం. రజినీని ఎవరు టార్గెట్‌ చేసినా వాళ్లకు గట్టిగా సమాధానం చెప్తా. త్వరలో రజినీ రాజకీయం ఏంటో అందరూ చూస్తారు-రాఘవ లారెన్స్‌. రజినీ మీద అభిమానంతో కమలహాసన్‌ పోస్టర్లను పేడతో కొట్టి చించేవాణ్ణి. వాళ్లిద్దరు కలవడం ద్వారా తమిళనాడులో మంచి రోజులు రాబోతున్నాయి -సినీ నటుడు రాఘవ లారెన్స్‌.
  • కరీంనగర్‌: కోరుట్లలో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన. ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల రాజేందర్‌. వైద్యంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజలు భయపడేవారు. కేంద్ర పథకం ఆయుష్మాన్‌ పథకం కన్నా ఆరోగ్యశ్రీ మిన్న.
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.

దీక్షకు ముందు బాబుకు షాక్.. సర్కార్ వ్యూహమిదేనా ?

jagan govt shocks chandrababu, దీక్షకు ముందు బాబుకు షాక్.. సర్కార్ వ్యూహమిదేనా ?

ఏపీలో ఇసుక రగడ తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాధినేత జగన్ తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఎదురు దాడికి దిగుతున్నారు. గతంలో జరిగిన ఇసుక అక్రమాలను పూర్తిగా అరికట్టే వరకు ఆగేది లేదని జగన్ చాటుతున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడలో 12 గంటల నిరాహార దీక్షకు సిద్దమయ్యారు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు. అయితే.. ఈ దీక్ష సమయంలోనే చంద్రబాబుకు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు ప్రభుత్వం, వైసీపీ పార్టీ రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

2014-2019 మధ్య కాలంలో ఏపీవ్యాప్తంగా ఇసుక రీచ్‌లపై తెలుగుదేశం నాయకులు పెద్దరికం చేసి, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమని చాటే ఓ నిఘా తరహా ఆపరేషన్‌ వివరాలను తేటతెల్లం చేయడం ద్వారా చంద్రబాబుకు దీక్షా సమయంలోనే షాకిచ్చేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నేతల బినామీ సంస్థగా భావిస్తున్న వైజాగ్ బ్లూ ఫ్రాగ్ అనే మొబైల్ టెక్నాలజీ కంపెనీపై ఏపీ సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

గతంలో ఈ సంస్థ వేదిక ఇసుక అక్రమాలు జరిగాయని, ప్రస్తుతం లేని ఇసుక కొరతను సృష్టించేందుకు బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ ప్రభుత్వ సర్వర్‌ను హ్యాక్ చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరదల కారణంగానే ఇసుక తరలింపు సాధ్యం కాలేదని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ కొందరు కావాలనే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకు కృత్రిమ కొరత సృష్టించారని తాజాగా తెలుస్తుంది. ఈ తతంగం బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ నుంచి జరిగిందని గుర్తించిన సిఐడి అధికారులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

ఏ స్థాయిలో ఇసుక కొరతను సృష్టించారు..? తద్వారా ఎవరికి బెనిఫిట్ జరిగింది ? అనే కోణంలో సిఐడి దర్యాప్తు కొనసాగుతోందని, గురువారం చంద్రబాబు దీక్ష కొనసాగుతున్న సమయం వరకు అక్రమార్కుల గుట్టు బట్టబయలు చేస్తామని కొందరు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ కుట్రలో తెలుగుదేశం నేతల హస్తం బయటపడితే.. చంద్రబాబుకు దీక్షా సమయంలో ఎంబర్రాసింగ్ తప్పదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.