రేపే ఏపీ అసెంబ్లీ.. ఇంతలో షాకింగ్ డెసిషన్

అటు రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ, టీడీపీ నేతలు పోటీ పోటీ భేటీలతో వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారు. కానీ ఇంతలో షాకింగ్ డెసిషన్ తీసుకుంది జగన్ ప్రభుత్వం.

రేపే ఏపీ అసెంబ్లీ.. ఇంతలో షాకింగ్ డెసిషన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2020 | 5:37 PM

జూన్ 16, 17 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్దమైంది. రెండ్రోజుల సమావేశాల కోసం ఏపీ అసెంబ్లీ ముస్తాబయింది. పోలీసులు సెక్యూరిటీ చర్యలు వేగవంతం చేశారు. అటు రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ, టీడీపీ నేతలు పోటీ పోటీ భేటీలతో వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారు. కానీ ఇంతలో షాకింగ్ డెసిషన్ తీసుకుంది జగన్ ప్రభుత్వం.

మంగళ, బుధవారాల్లో సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ఆమోదాలతోపాటు కొన్ని బిల్లులను ఆమోదించనున్నది. ప్రతీ ఆరు నెలలకోసారి మాండేటరీగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి వుండడం, దానికితోడు 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం పొందకపోవడం వల్ల జగన్ ప్రభుత్వం ఆగమేఘాల మీద శాసనసభా సమావేశాలకు రంగం సిద్దం చేసింది.

మరోవైపు దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోను కరోనా పాజిటివ్ కేసులు శరవేగంతో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెషన్ అంటే 175 మంది ఎమ్మెల్యేలు.. వారి సిబ్బంది, శాసనసభ సచివాలయ సిబ్బంది, మంత్రులు, ముఖ్యమంత్రి అనుచర గణం, విపక్ష నేతల అనుచర గణం… వారికి తోడు వేలాది సంఖ్యలో పోలీసు బలగాలు.. మరి కరోనా నియంత్రణ ఎలా ? అందుకే ముందస్తు చర్యగా జగన్ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయం తీసుకున్నదే తడవుగా.. అమరావతిలో అందుబాటులో వున్న ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు చేయడం ప్రారంభమైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఏపీ ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు ప్రారంభం అయ్యాయి. గుంటూరులోని ఐబీ అతిధి గృహంలో ఎమ్మెల్యేలు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో