అయిదోసారి ప్రధానిగా బెంజిమెన్‌ నెతాన్యాహూ

ఇజ్రాయిల్ : ఇజ్రాయిల్‌ జాతీయ ఎన్నికల్లో మరోసారి ప్రధాని బెంజిమెన్‌ నెతాన్యాహూ విజయం సాధించారు. దీంతో ఆయన 5వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బెన్నీగంజ్‌‌తో తీవ్ర పోటీ ఎదురైనా.. నెతాన్యాహూ మళ్లీ విజయం సాధించినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి. మొత్తం 97 శాతం ఓట్ల లెక్కింపు జరిగిందని, ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదని, కానీ నెతాన్యాహూ కూటమి బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెతాన్యాహూపై ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ […]

అయిదోసారి ప్రధానిగా బెంజిమెన్‌ నెతాన్యాహూ
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2019 | 3:52 PM

ఇజ్రాయిల్ : ఇజ్రాయిల్‌ జాతీయ ఎన్నికల్లో మరోసారి ప్రధాని బెంజిమెన్‌ నెతాన్యాహూ విజయం సాధించారు. దీంతో ఆయన 5వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బెన్నీగంజ్‌‌తో తీవ్ర పోటీ ఎదురైనా.. నెతాన్యాహూ మళ్లీ విజయం సాధించినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి. మొత్తం 97 శాతం ఓట్ల లెక్కింపు జరిగిందని, ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదని, కానీ నెతాన్యాహూ కూటమి బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెతాన్యాహూపై ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఎన్నికల్లో నెతన్యాహూ పోటీ చేస్తున్న లికుడ్ పార్టీకి 37 సీట్లు రాగా, ప్రతిపక్ష బ్లూ అండ్ వైట్ పార్టీ 35 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

కాగా, 97 శాతం కౌంటింగ్ పూర్తయిన నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైనట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. ఈ ఫలితాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నెతన్యాహూ.. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం మిగతా చిన్నపార్టీలతో చర్చలు ప్రారంభించినట్లు బెంజిమెన్‌ నెతాన్యాహూ వెల్లడించారు.