Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

సుమక్కకు జీఎస్టీ తిప్పలు.. కెరీర్ ఇక కష్టమేనా.?

GST Issue Effects Anchor Suma Career, సుమక్కకు జీఎస్టీ తిప్పలు.. కెరీర్ ఇక కష్టమేనా.?

టాలీవుడ్ యాంకర్లలో సుమకంటూ  ప్రత్యేక స్థానం ఉంది. పేరుకు మలయాళీ అయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ బుల్లితెరను ఏలేస్తోంది. ఈవెంట్లు, రియాలిటీ షోలు.. గేమ్ షోలు.. ఆడియో ఫంక్షన్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ కూడా సుమ హోస్టుగా వ్యవహరించాల్సిందేనని చాలామంది హీరోలు పట్టుబడతారు. ఇప్పుడు ఎందరో అందమైన యాంకరమ్మలు వచ్చినా.. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరూ కూడా సుమకే ఓటేస్తారు. అయితే కొద్దిరోజులుగా సుమ చేస్తున్న రకరకాల డిమాండ్లతో నిర్మాతలకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సుమ రెండు గంటల వ్యవధి ఉన్న ఒక్కో షోకు రూ.3-5 లక్షలు డిమాండ్ చేస్తోందట. అంతేకాక జీఎస్టీ అదనంగా బాదేస్తోందని వినికిడి. దీంతో టాలీవుడ్ నిర్మాతలకు తడిసి మోపెడవుతోందని సమాచారం. అందుకే సుమను పక్కన పెట్టి.. ఆమె కన్నా తక్కువకే హోస్టింగ్ చేసే మిగతా వారితో సరిపెట్టుకోవాలని చూస్తున్నారట. అటు చిన్న సినిమాలకు కూడా సుమ ఇదే విధంగా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడం వల్ల ఈమె స్థానంలో మరో యాంకర్ మంజూషను తీసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే హీరోయిన్లయినా.. యాంకరమ్మలైనా అధిక రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తే.. నిర్మాతలు పక్కన పెట్టేసినట్లే..