మహేష్ విషయంలో అనిల్‌ది కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్సా..?

రచయితగా టాలీవుడ్‌లో పలు సినిమాలకు పనిచేసి.. పటాస్ చిత్రంతో డైరక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఏ ముహూర్తాన దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడో తెలీదు గానీ.. వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేనా.. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబునే డైరక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక స్క్రిప్ట్ చెప్పే విషయంలోనే ఇతగాడి టాలెంట్‌కు మెచ్చిన మహేష్ బాబు.. సుకుమార్‌ స్క్రిప్ట్‌ను కూడా పక్కనపెట్టాడని అప్పట్లో వార్తలు కూడా […]

మహేష్ విషయంలో అనిల్‌ది కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్సా..?
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2019 | 12:58 PM

రచయితగా టాలీవుడ్‌లో పలు సినిమాలకు పనిచేసి.. పటాస్ చిత్రంతో డైరక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఏ ముహూర్తాన దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడో తెలీదు గానీ.. వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేనా.. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబునే డైరక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక స్క్రిప్ట్ చెప్పే విషయంలోనే ఇతగాడి టాలెంట్‌కు మెచ్చిన మహేష్ బాబు.. సుకుమార్‌ స్క్రిప్ట్‌ను కూడా పక్కనపెట్టాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు మహేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లేటప్పుడే అధికారికంగా ప్రకటించారు. కాగా అదే సమయానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురంలో కూడా విడుదల అవ్వబోతోంది. దీంతో వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఈ క్రమంలో తమ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసుకునేందుకు బన్నీ టీమ్ ఓ అడుగు ముందుకేసింది. ఇప్పటికే పోస్టర్లతో పాటు రెండు పాటలను కూడా విడుదల చేసింది. ఆ రెండు పాటలు అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై కూడా అంచనాలను పెంచేస్తున్నాయి. కానీ ఈ విషయంలో మహేష్ టీమ్ మాత్రం కాస్త సైలెంట్‌గా ఉంటూ వస్తోంది. ఇప్పటివరకు సరిలేరు నుంచి పోస్టర్లు, ఒక్క పాట మినహా ఇంకేమీ విడుదల కాలేదు. అందులో పోస్టర్లకు మంచి టాక్ వచ్చినప్పటికీ.. పాట మాత్రం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మహేష్ సినిమా కంటే బన్నీ సినిమానే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశాడు అనిల్ రావిపూడి. అందులో ఓ సెటైర్ కూడా వేశాడు. మన సినిమా రిలీజ్ అయ్యేది వచ్చే సంక్రాంతికి.. దానికి ఇప్పటినుంచే ప్రమోషన్లు ఎందుకు అంటూ అన్నాడు. అయితే ఈ సెటైర్ బన్నీ టీమ్ కోసం వేసిందేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వారి ప్రమోషన్లను ఉద్దేశించే అనిల్ రావిపూడి ఈ కామెంట్ చేశాడని కొందరు భావిస్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. సరిలేరు నీకెవ్వరుపై అనిల్ ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ప్రమోషన్లు ఓ రేంజ్‌లో లేకపోయినా.. ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం కచ్చితంగా మెప్పిస్తుందని.. ఈ సంక్రాంతికి తన ఖాతాలో మరో హిట్ పడుతుందని అతడు భావిస్తున్నాడట. అంతేకాదు ఎలాగూ మహేష్ బాబు సినిమా కాబట్టి.. ఓపెనింగ్స్ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని అతడు అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో అనిల్ పెద్దగా పట్టించుకోవట్లేదట. అయితే ఎంత పెద్ద హీరో అయినా.. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి.. కచ్చితంగా ప్రమోషన్లు అవసరం. కానీ ఆ ప్రమోషన్లలో మహేష్ టీమ్ వెనుకబడితే మాత్రం.. అది సినిమా కలెక్షన్లపై బాగా ప్రభావితం చూపించే అవకాశం ఉందన్నది కొందరి అభిప్రాయం. ఏదేమైనా మహేష్ విషయంలో అనిల్‌కున్నది కాన్ఫిడెన్సో..? ఓవర్ కాన్ఫిడెన్సో..? సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో