యువ ఆటగాళ్లలో ఆడాలన్న కసి లేదు.. ధోని వ్యాఖ్యలు.. మాజీలు చురకలు.!

ఐపీఎల్ ఛాంపియన్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

యువ ఆటగాళ్లలో ఆడాలన్న కసి లేదు.. ధోని వ్యాఖ్యలు.. మాజీలు చురకలు.!

Updated on: Oct 20, 2020 | 4:01 PM

MS Dhoni’s Comment About Youngsters: ఐపీఎల్ ఛాంపియన్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే నిన్న రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ”సీనియర్లను తుది జట్టు నుంచి తప్పించి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చేందుకు.. వారిలో ఆడాలన్న కసి కనిపించలేదు. అందుకే అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు లీగ్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో వారికి అవకాశం ఇస్తాం. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడొచ్చు” అని పేర్కొన్నాడు.

ఇక ధోని చేసిన ఈ వ్యాఖ్యలపై అటు నెటిజన్లు.. ఇటు మాజీ క్రికెటర్లు చురకలు అంటిస్తున్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధోని వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక విధానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లలో కనిపించని కసి, ఫామ్.. కేదార్ జాదవ్, పీయూష్ చావ్లాలో కనిపించిందా.? చెన్నై తనకు తానుగా చేసిన తప్పిదాల వల్లే ఈ సీజన్‌లో లీగ్ స్టేజి నుంచే ఇంటి ముఖం పట్టిందని శ్రీకాంత్ అన్నాడు. అంతేకాకుండా చాలామంది నెటిజన్లు కూడా ధోని వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. ‘యువ ఆటగాళ్లకు ఒక్క అవకాశం ఇవ్వడానికి చూడలేదు గానీ.. ఫామ్ లేని కేదార్ జాదవ్‌ను మాత్రం ఎందుకు అన్ని మ్యాచ్‌లు ఆడించారో.? చెప్పండి అని కామెంట్స్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us