ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఢిల్లీ ఖాతాలో అరుదైన రికార్డు..

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 20వ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 30 రన్స్ చేయడం జరిగింది.

  • Ravi Kiran
  • Publish Date - 10:27 pm, Sun, 20 September 20
ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఢిల్లీ ఖాతాలో అరుదైన రికార్డు..

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 20వ ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 30 రన్స్ చేయడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఇన్ని రన్స్ నమోదు కావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. (IPL 2020)

ఢిల్లీ బాట్స్‌మెన్‌ మార్కస్ స్టోయినిస్‌ 20వ ఓవర్ మొదటి బాల్‌కు 6 కొట్టగా.. ఆ తర్వాత వైడ్.. నెక్స్ట్ మూడు బంతుల్లో 3 ఫోర్లు బాదాడు. 5వ బంతిని సిక్స్‌గా మలిచిన స్టోయినిస్‌.. 6వ బంతికి రన్ తీస్తూ రనౌట్ అయ్యాడు. అయితే అది నోబాల్. ఇక చివరి బంతికి నార్టే 3 రన్స్ తీయడంతో 20 ఓవర్లో మొత్తంగా 30 రన్స్ వచ్చాయి. దీనితో ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్‌లో 30 రన్స్ తీసిన తొలి జట్టుగా ఢిల్లీ నిలవడమే కాకుండా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.