IPL 2020: తెవాటియా షో.. రాయల్స్ సూపర్ విక్టరీ

ఐపీఎల్‌ 2020లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి..

IPL 2020: తెవాటియా షో.. రాయల్స్ సూపర్ విక్టరీ

Updated on: Oct 11, 2020 | 7:41 PM

IPL 2020: ఐపీఎల్‌ 2020లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. లీగ్‌లో మూడో విజయాన్ని అందుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముందుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్(48), మనీష్ పాండే (54) రాణించడంతో ఎస్ఆర్‌హెచ్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు బట్లర్(16), స్టోక్స్‌(5) తక్కువ పరుగులకే ఔట్ కాగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్(5), సంజూ శాంసన్(26) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. దీనితో ఒక దశలో రాజస్తాన్ ఓటమి ఖాయంగా కనిపించింది. అయితే చివర్లో తెవాటియా(45*), రియాన్ పరాగ్(42*) అద్భుతం చేయడంతో విజయం రాయల్స్ సొంతమైంది. తెవాటియా మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read:

మ్యాక్స్‌వెల్.. ఎక్కడ నీ మ్యాడ్‌నెస్‌..!

సీఎస్‌కే ఓటమి.. జీవా ధోనిపై అసభ్యకర వ్యాఖ్యలు..

Loading...
Unable to load recommendations.
Follow Us